![]() |
![]() |

బుల్లితెర నటి శ్రీవాణి గురించి అందరికీ బాగా తెలుసు. సీరియల్స్ లో నటిస్తుంది..షోస్ లో పార్టిసిపేట్ చేస్తుంది..సోషల్ మీడియాలో అప్ డేట్ గా ఉంటుంది. అంతే కాదు రీసెంట్ గా ఒక కొత్త ఇల్లు కూడా కొనుక్కుంది..అందులోకి గృహప్రవేశం కూడా చేసేసింది. ఇక తన యూట్యూబ్ ఛానల్ లో డైలీ అప్ డేట్స్, పర్సనల్ విషయాలు, ప్రాంక్ వీడియోస్ అన్ని రెగ్యులర్ గా అప్ లోడ్ చేస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు తన ఇంటి గృహప్రవేశం ముందు చేసిన చీరల షాపింగ్ వీడియోని రీసెంట్ గా పోస్ట్ చేసింది. ముందు చీరల షాప్ కి తన కూతురు నందినిని తీసుకుని వెళ్ళింది శ్రీవాణి.
అక్కడ ఎంట్రన్స్ లో కంచి కామాక్షమ్మ విగ్రహం చూసి "ఏదైనా కోరిక కోరుకో అమ్మవారు తీరుస్తారు" అని నందినికి చెప్పింది. "నేను హైట్ అవ్వాలి" అని నందిని కోరుకునే సరికి శ్రీవాణి షాకయ్యింది. ఇక నందినికి పట్టు లంగావోణి సెలెక్షన్స్ లో చాలా బిజీగా ఉండగా "అమ్మా ఈరోజు నువ్వింత బాగున్నావేంటి" అని శ్రీవాణికి బిస్కెట్ వేసేసరికి "ఇలాంటి మాటలు చెప్పకుండా నీకేం కావాలో చెప్పు" అని కౌంటర్ వేసింది. ఇలా ఇంకా ఎన్నో రకాల చీరలు, బోర్డర్స్, కలర్ కాంబినేషన్స్ చూసి చివరికి నందినికి ఒక కలర్ ఫుల్ లంగా వోణి వేసి చూసుకుని మురిసిపోయింది శ్రీవాణి.
![]() |
![]() |